Cricket World Cup 2023: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. దక్షిణాఫ్రికాను కష్టాల్లోకి నెట్టిన పార్ట్ టైం బౌలర్

Cricket World Cup 2023: ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. దక్షిణాఫ్రికాను కష్టాల్లోకి నెట్టిన పార్ట్ టైం బౌలర్

వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు తడబడుతుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును మిల్లర్, క్లాసన్ ఆదుకున్నారు. 5 వికెట్ కు 95 పరుగులు జోడించి సఫారీలను పోటీలో నిలబెట్టారు. ఇక మ్యాచ్ హోరీహోరీగా సాగటం ఖాయమనుకున్న దశలో ఆసీస్ పార్ట్ టైం బౌలర్ ట్రావిస్ హెడ్ దక్షిణాఫ్రికాకు ఊహించని షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను తీసి దక్షిణాఫ్రికా జట్టును చావు దెబ్బ కొట్టాడు. 

మిల్లర్, క్లాసన్ భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి హెడ్ ను రంగం లోకి దించిన కమ్మిన్స్ ప్లాన్ వర్కౌటైంది. 31 ఓవర్ తొలి రెండు బంతులకి ఫోర్లు సమర్పించుకున్న హెడ్ మూడో బంతికి జోరు మీదున్న క్లాసన్ ను బౌల్డ్ చేసాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ జాన్సెన్ ను యల్ బీ డబ్ల్యూ గా వెనక్కి పంపాడు. దీంతో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం 6 వికెట్లకు 139 పరుగులు చేసింది. క్రీజ్ లో మిల్లర్ (59) కొయెట్జ్(9) ఉన్నారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న దక్షిణాఫ్రికా 24 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు డికాక్ 3 పరుగులు చేస్తే బావుమా డకౌట్ అయ్యాడు. వాండర్ డస్సెన్ 6 పరుగులు, మార్కరం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు క్యూ కట్టారు. స్టార్క్, హేజాల్ వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు.