రూ.500 కోసం జుట్లు పట్టుకున్నరు

రూ.500 కోసం జుట్లు పట్టుకున్నరు

పాట్నా: బీహార్​లోని ఓ ప్రైమరి హెల్త్​సెంటర్ లో రూ.500 కోసం ఇద్దరు హెల్త్​వర్కర్లు జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. బీహార్​లోని జముయి జిల్లా లక్ష్మీపూర్ ​బ్లాక్​లోని ప్రైమరీ హెల్త్​సెంటర్​లో ఆదివారం.. రింటూ కుమారి అనే ఆశా వర్కర్ ఓ పాపకు​ బీసీజీ టీకా వేయించేందుకు రంజన కుమారి అనే ఏఎన్ఎం దగ్గరకు తీసుకువెళ్లింది. 

టీకా వేసేందుకు ఏఎన్ఎం రూ.500 డిమాండ్​ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అదికాస్తా పెరిగి, జుట్లు పట్టుకొని కొట్టుకునేదాకా పోయింది. పిల్లలకు వ్యాక్సిన్​ వేయించేందుకు వచ్చిన వాళ్లు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు వినలే. చివరకు చెప్పులతో కొట్టుకునే ప్రయత్నం చేయడంతో ఓ వ్యక్తి బలవంతంగా ఆపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, ఇద్దరిలో ఇప్పటి వరకు ఆఫీసర్లు ఎవరినీ సస్పెండ్​ చేయలేదు.