వానాకాలం కష్టాలకు చెక్.. రంగంలోకి 20 హైడ్రా బైక్ టీమ్స్

వానాకాలం కష్టాలకు చెక్.. రంగంలోకి 20 హైడ్రా బైక్ టీమ్స్
  •     కూలిన చెట్లు, డ్రైనేజీ అవరోధాల తొలగింపు పనులు చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్​సిటీ: అత్యవసర పరిస్థితుల్లో డీఆర్ఎఫ్ టీమ్స్ వెళ్లలేని ఇరుకైన, ట్రాఫిక్ జామ్ ప్రాంతాలకు క్షణాల్లో చేరుకునేందుకు హైడ్రా బైక్ టీమ్‌‌‌‌లు రంగంలోకి దిగాయి. గతేడాది సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన ఈ టీమ్‌‌‌‌లను ఈసారి మరింత సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 20 బైకులతో కూడిన ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌‌‌‌లు 24 గంటలు అందుబాటులో ఉండేలా 60 మంది సిబ్బందిని మూడు షిఫ్టుల్లో నియమించారు. 

రహదారులపై ట్రాఫిక్ తీవ్రంగా ఉన్నా, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌ల మీదుగా లేదా బైకులను పక్కనబెట్టి పనిముట్లతో సహా కాలినడకనైనా ఘటనా స్థలానికి చేరుకునేలా వీరికి శిక్షణ ఇచ్చారు. ఈ బైకులకు ప్రత్యేకంగా అమర్చిన బాక్సుల్లో బ్యాటరీతో నడిచే రెండు చైన్ సా(రంపాలు), తాడు వంటి ఆధునిక పరికరాలను ఉంచారు. చెట్లు కూలడమే కాకుండా, వాటర్ లాగింగ్(నీరు నిలిచే) పాయింట్ల వద్ద గడ్డపారలతో డ్రైనేజీ అవరోధాలను తొలగించి నీరు సజావుగా సాగిపోయేలా ఈ మల్టీ టాస్కింగ్ టీమ్‌‌‌‌లు పని చేస్తున్నాయి.