నా సినిమా క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో యువతను తప్పుదారి పట్టించొద్దు: ట్రోలర్స్‎పై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్

నా సినిమా క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో యువతను తప్పుదారి పట్టించొద్దు: ట్రోలర్స్‎పై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్

న్యూఢిల్లీ: తన సినిమాల క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించి ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. ఇవి యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనకారులపై కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో నెటిజన్లు ఆమె సినిమాల్లోని సన్నివేశాలను షేర్ చేస్తూ ట్రోలింగ్‎కు దిగారు. దీనిపై ఆమె ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలో స్పందిస్తూ.. ‘నేను కోట్లు సంపాదించే సినిమా పాత్రల క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను, హై-ప్రొఫైల్ షో బిజ్ ఈవెంట్స్ వీడియోలను తీసుకెళ్లి రోడ్లపై, స్కూల్ ఫంక్షన్లలో, క్లబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిరిగే అమాయక టీనేజర్లకు ఆపాదిస్తారా..? ఇవన్నీ ఒకటేనా..?" అంటూ ప్రశ్నించారు.