రెండేండ్లలో రెట్టింపైన అగ్రి డిగ్రీ సీట్లు: అగ్రికల్చర్ వర్సిటీ వీసీ

రెండేండ్లలో రెట్టింపైన అగ్రి డిగ్రీ సీట్లు: అగ్రికల్చర్ వర్సిటీ వీసీ

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్​ యూనివర్సిటీలో రెండేండ్లలో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ సీట్లు దాదాపు రెట్టింపు అయ్యాయని వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. 2023-24లో 1,012గా ఉన్న సీట్లు 2026-27 విద్యా సంవత్సరానికి సుమారు రెండు వేల వరకు పెరిగాయని వెల్లడించారు.

ఈ సంవత్సరం వర్సిటీ పరిధిలోని 13 కాలేజీల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్‌‌తో పాటు ఇతర డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆన్‌‌లైన్ అప్లికేషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఎప్​సెట్​-2026లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆగస్టు 11 వరకు ఫీజు చెల్లించి, ఆగస్టు 12లోగా అప్లై చేసుకోవాలని సూచించారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక అగ్రికల్చర్​ కాలేజీ ఏర్పాటు లక్ష్యంగా కొడంగల్, హుజూర్‌‌నగర్, డిచ్‌‌పల్లిలో కొత్త కాలేజీలను ప్రారంభించామని, ఈ ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో120 సీట్లు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక కోటా ఫీజులను గణనీయంగా తగ్గించామన్నారు. గతంలో ఒకేసారి రూ.10 లక్షలు, వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒక్కో సెమిస్టర్‌‌కు రూ.75 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్‌‌ఆర్‌‌ఐ కోటా ఫీజులను తగ్గించి ఒక్కో సెమిస్టర్‌‌కు రూ.1.35 లక్షలకు పరిమితం చేసినట్లు వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలు ఐకార్ గుర్తింపు పొందాయని, ఏఐ, లేటెస్ట్​ల్యాబ్స్, టెక్నాలజీ ఇన్​ఫ్రాతో బోధనను ఆధునికీకరించామని, దీంతో స్టూడెంట్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టామన్నారు.

మరిన్ని వార్తలు