ముందు మీ బీజేపీ నేతలకు చెప్పండి.. ప్రధాని మోడీకి రాజ్ ఠాక్రే కౌంటర్

ముందు మీ బీజేపీ నేతలకు చెప్పండి.. ప్రధాని మోడీకి రాజ్ ఠాక్రే కౌంటర్

ముంబై: దూషించే భాష వాడొద్దని ప్రతిపక్ష నేతలకు చెప్పేముందు, అదే విషయాన్ని ముందు మీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పాలని ప్రధాని మోదీకి ‘మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన’ (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే సూచించారు. శనివారం మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ ఒక్కటే కారణం కాదని, చాలా ఏళ్లుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల వల్లే ఈ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయని అన్నారు. నీట్ అక్రమాలపై జరిగిన ఆందోళనల్లో తనను, తన దివంగత తల్లిని దూషించారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్ ఠాక్రే స్పందించారు. 

‘‘ఎవరూ అసభ్య పదాలు వాడకూడదు. కానీ ముందు మీ పార్టీ వాళ్లకే ఆ విషయం చెప్పండి” అని అన్నారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీతో పాటు ఠాక్రే కుటుంబంపై కూడా బీజేపీ దూషణలు చేస్తూ ట్రోలింగ్​చేస్తోందని ఆరోపించారు. ఇతరులకు కూడా తల్లులు ఉంటారని, వ్యక్తిగత దూషణలు ఆపాలని సూచించారు. గత 12 ఏళ్లలో బీజేపీ చేసిన పనులకు ఎవరు క్షమాపణ చెబుతారని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసు చర్యలకు ఆదేశించిన వారు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.