ఆర్టీసీ కంటే 20 శాతం తక్కువ చార్జీ : స్మార్ట్​బస్​ ఆపరేటర్ ​ఫ్రెష్​బస్​

ఆర్టీసీ కంటే 20 శాతం తక్కువ చార్జీ : స్మార్ట్​బస్​ ఆపరేటర్ ​ఫ్రెష్​బస్​

హైదరాబాద్​, వెలుగు: తమ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల కంటే 20 శాతం తక్కువ చార్జీలు ఉంటాయని స్మార్ట్​బస్​ ఆపరేటర్ ​ఫ్రెష్​బస్​ ప్రకటించింది. హైదరాబాద్​–విజయవాడ, బెంగళూరు–తిరుపతి మార్గాల్లో ప్రస్తుతం 12 ఎలక్ట్రిక్​ బస్సులను నడుపుతున్నామని తెలిపింది. డీజిల్​ బస్సుతో పోలిస్తే నిర్వహణ ఖర్చు తక్కువ కాబట్టి చార్జీలూ తక్కువని  పేర్కొంది. 

రెండు రౌండ్ల ప్రీ-సీడ్ ఫండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.23.5 కోట్ల పెట్టుబడిని సాధించామని తెలిపింది. 2025 మార్చి నాటికి రూ.100 కోట్లను సేకరిస్తామని తెలిపింది. అప్పటికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, జైపూర్, పంజాబ్, హర్యానా మొదలైన 30  నగరాల్లో 170 బస్సులను నడపనుంది.