ఇయ్యాల్టి నుంచి తొలి వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్

ఇయ్యాల్టి నుంచి తొలి వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్
  • ఒలింపిక్‌‌‌‌ బెర్తులపై బాక్సర్ల గురి

న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ మహ్మద్ హుస్సాముద్దీన్ సహా తొమ్మిది మంది ఇండియా బాక్సర్లు పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ కోటాలు దక్కించుకోవడమే టార్గెట్‌‌‌‌గా ఆదివారం ఇటలీలోని బస్టో అర్సిజియోలో మొదలయ్యే తొలి వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌‌‌‌లో బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీలో  సెమీస్ చేరిన వారికి పారిస్ టికెట్లు లభిస్తాయి.  హుస్సామ్‌‌‌‌ (57 కేజీ), దీపక్ భోరియా (51 కేజీ), నిశాంత్ దేవ్  (71 కేజీ)పై భారీ అంచనాలున్నాయి. 

వీరితో పాటు శివ థాపా (63.5 కేజీ), లక్ష్య చహర్ (80 కేజీ), సంజీత్‌‌‌‌ (92 కేజీ), నరేందర్ బేర్వాల్ (+92 కేజీ), విమెన్స్‌‌‌‌లో జాస్మిన్ లంబోరియా(60 కేజీ), అంకుషిత బోరో (66 కేజీ) అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.