V6 News

ఆర్టీసీ బస్సులో హాష్ ఆయిల్  రవాణా..2.1 కిలోలు స్వాధీనం

ఆర్టీసీ బస్సులో హాష్ ఆయిల్  రవాణా..2.1 కిలోలు స్వాధీనం

ఎల్బీనగర్, వెలుగు: ఏపీనుంచి హైదరాబాద్‌‌కు ఆర్టీసీ బస్సులో హాష్​ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇన్‌‌స్పెక్టర్ వినోద్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కొర్ర ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన బింగు కార, రాజేశ్​కారలు కలిసి ఏపీకి చెందిన పాడి కృష్ణారావు నుంచి హాష్​ ఆయిల్ సేకరించారు.

అనంతరం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌‌కు తరలించారు. ఎల్బీనగర్ మెట్రో సమీపంలో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు ఎదురు చూస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 2 కిలోల 100 గ్రాముల హాష్ ఆయిల్, మూడు సెల్‌‌ఫోన్లు, రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు.