ఎండ తీవ్రతకు వడదెబ్బతో 22 మంది మృతి

ఎండ తీవ్రతకు వడదెబ్బతో 22 మంది మృతి

వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌: ఎండ తీవ్రతకు తోడు వడగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు వడదెబ్బ బారిన పడుతున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 22 మందికి పైగా వడదెబ్బతో చనిపోయారు.

యాదాద్రి జిల్లా రాజపేట మండలంలో బొందుగుల గ్రామానికి చెందిన గోపగాని శ్రీధర్ (42 ), ఖమ్మం జిల్లా  పెనుబల్లి మండలం టేకులపల్లిలో కూలీ మల్లారపు వెంకటేశ్వర్లు (50), కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన దుంపల సాయి చరణ్(31), కారేపల్లి మండలం రామకృష్ణాపురానికి చెందిన రెడ్డబోయిన వెంకమ్మ (66), మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారిమడూరుకు చెందిన సోమ నారాయణ (65), అమ్మాపురం గ్రామానికి చెందిన అత్తిల్లి రాము (60), భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఎస్‌‌‌‌‌‌‌‌కే. షాహిదా (65), పాల్వంచలో యాచకుడు, నారాయణరావుపేటకు చెందిన రింగు అనసూయ (45), చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన శానిటేషన్‌‌‌‌‌‌‌‌ వర్కర్‌‌‌‌‌‌‌‌ రజనీకాంత్‌‌‌‌‌‌‌‌ (36), భద్రాచలం పట్టణానికి చెందిన మాటూరి సావిత్రి (71), కండే వెంకన్న (42) వడదెబ్బతో చనిపోయారు.

అలాగే వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన వనం వజ్రమ్మ (70 ), రొడ్డ సుశీల, యాదవ కాలనీకి చెందిన చందు ఐలయ్య (88), ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా సిర్పూర్‌‌‌‌‌‌‌‌ మండలం జక్కాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన పిప్రే సాయినాథ్ (45), పారిగం గ్రామానికి చెందిన ఎలుకరి అశోక్ (41), పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు సంపత్​ (49), అశోక్​నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన బొజ్జ శంకర్​ (68), మల్యాలపల్లికి చెందిన కత్తెరమల్ల నంబమ్మ (60) చనిపోయారు. జనగామ పట్టణానికి చెందిన జ్యోతి (70), భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన ఎర్రబోయిన జయలక్ష్మి (70) వడదెబ్బతో చనిపోయారు.