ఏపీలో కొత్తగా 22,517 కరోనా పాజిటివ్ కేసులు, 98 మృతి

V6 Velugu Posted on May 15, 2021

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, పెద్ద ఎత్తున మరణాలు నమోదవుతున్నాయి. కరోనాతో ఇవాళ(శనివారం) 98మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది.గడచిన 24 గంటల్లో 89,535 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,517 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,383 కొత్త కేసులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో 2,975 కేసులు, చిత్తూరు జిల్లాలో 2,884 కేసులు గుర్తించారు.

ఇక 18,739 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒక్క అనంతరం జిల్లాలోనే 12 మంది కరోనాకు బలయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 14,11,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా..11,94,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2,07,467 మంది చికిత్స పొందుతున్నారు. 

Tagged AP, new corona positive cases 22517, 98 deaths

Latest Videos

Subscribe Now

More News