
నిర్మల్ జిల్లా భైంసాలో నిన్న(ఆదివారం) రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక శివాజీ నగర్‌లో సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు గొడవకు దిగారు.తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక కారు, ఆటో అద్దాలను ధ్వంసం చేసి.. బైక్ కు నిప్పు పెట్టారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న భైంసా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘర్షణ కారణంగా ఇవాళ(సోమవారం) పట్టణంలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్ భైంసాకు చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.