ఇందిరమ్మ స్కీమ్ కు 246 మంది ఏఈలు

ఇందిరమ్మ స్కీమ్ కు 246 మంది ఏఈలు
  • ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకం 
  • లోకల్ ఎలక్షన్ ముగియగానే అపాయింట్​మెంట్ ఆర్డర్లు 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు కొత్తగా 246 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ) రానున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వీరి నియామకానికి అనుమతి ఇవ్వాలని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు హౌసింగ్ కార్పొరేషన్  ప్రతిపాదనలు పంపగా అనుమతి ఇచ్చింది. వీరి నియామక పక్రియను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి  అప్పగించగా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిసింది. 

పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత వీరికి అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మండలాల్లో పోస్టింగ్స్​ఇవ్వనున్నారు. ప్రతి నెల కార్పొరేషన్ లో ఇంజనీర్లు, ఏఈలు, ప్రాజెక్టు డైరెక్టర్లు రిటైర్ అవుతుండగా పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్  ప్రారంభంలోనూ రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిన  390 ఏఈ పోస్టులను ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేశారు. తాజాగా అదే ఏజెన్సీకి 246 మంది ఏఈల నియామక పక్రియను అప్పగించారు. 

వేగంగా ఇండ్ల నిర్మాణం

నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 2 లక్షల 48 వేల ఇండ్ల పనులు స్టార్ట్ కాగా సుమారు 50 వేల ఇండ్లకు స్లాబ్ పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో ఉన్న ఇండ్లన్నింటినీ వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వచ్చే నెల నుంచి జీహెచ్ ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సైతం ఇందిరమ్మ ఇండ్లను జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.