2030 నాటికి 2వేల 500 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్

2030 నాటికి 2వేల 500 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్

 

  • ప్రభుత్వానికి 100 బిలియన్​ డాలర్ల ఆదాయం
  • 1.52 రెట్లు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య
  •  ఐసీఆర్ఏ అంచనా

న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్​ (జీసీసీలు) సంఖ్య 2,500కు పైగా పెరుగుతుందని రేటింగ్​ సంస్థ ఐసీఆర్ఏ అంచనా వేసింది.  ప్రస్తుతం దేశంలో సుమారు 1,700 జీసీసీలు ఉన్నాయి. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో, జీసీసీలు టాప్​–6 నగరాలలో రికార్డు స్థాయిలో 24 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్​ ఏ ఆఫీస్​ స్పేస్​ను లీజుకు తీసుకున్నాయి.  

మొత్తం లీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీటి వాటా 2023 ఆర్థిక సంవత్సరంలో 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగింది. 2026, 2027 ఆర్థిక సంవత్సరాలలో జీసీసీలు 50-55 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్​ ఏ ఆఫీస్​ స్పేస్​ను లీజుకు తీసుకుంటాయని ఐసీఆర్ఏ అంచనా వేసింది. ఇది బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , హైదరాబాద్​, ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​, పుణెలలో మొత్తం ఆఫీస్​ స్పేస్​ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 38-–40 శాతం వాటాకు సమానం.  2030 నాటికి జీసీసీల సంఖ్య 1,700 నుంచి 2,500కు పెరగడం ద్వారా ప్రభుత్వాలకు 100 బిలియన్ ​డాలర్లకు పైగా ఆదాయం వస్తుంది. 

ఉద్యోగుల సంఖ్య 1.5-2 రెట్లు పెరగనుంది. తక్కువ ఖర్చులు, తగినంత ట్యాలెంట్ అందుబాటులో ఉండటం, ప్రభుత్వాల నుంచి మద్దతు వల్ల గ్లోబల్​ కంపెనీలు మనదేశంలో జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయని ఐసీఆర్ఏ కార్పొరేట్​ రేటింగ్స్​ వైస్– ప్రెసిడెంట్​ అనుపమా రెడ్డి అన్నారు.