జులైలో 2,617 మంది పిల్లలను కాపాడినం: విమెన్ సేఫ్టీ వింగ్

జులైలో 2,617 మంది పిల్లలను కాపాడినం: విమెన్ సేఫ్టీ వింగ్

హైదరాబాద్, వెలుగు: మిస్సింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్‌‌లో చిక్కుకున్న చిన్నారుల ఆచూకీని కనిపెట్టేందుకు రాష్ట్రంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కంటిన్యూ అవుతోంది. ఆపరేషన్‌‌ ముస్కాన్‌‌ 9వ విడతలో 2,617 మంది చిన్నారులను అధికారులు ట్రేస్ చేశారు. జులై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌‌ వివరాలను విమెన్ సేఫ్టీ వింగ్‌‌ అడిషనల్‌‌ డీజీ షికా గోయల్ మంగళవారం వెల్లడించారు. రెస్క్యూ చేసిన వారిలో2,354 మంది బాలురు.. 263 మంది బాలికలు ఉన్నారని తెలిపారు.

 వీరిలో 2,230 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. భిక్షాటన, వీధిబాలలు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 800 బాలకార్మికులను రెస్క్యూ చేశామని వివరించారు. చిన్నారుల మిస్సింగ్స్ పై వివిధ చట్టాల కింద 429 ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు చేసి.. బాధ్యులైన436 మందిని అరెస్టు చేశామన్నారు.