మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు.. ఈ రైళ్లలో నో రిజర్వేషన్ : రైల్వే అధికారులు

మేడారం జాతరకు 28  ప్రత్యేక రైళ్లు.. ఈ రైళ్లలో నో రిజర్వేషన్ : రైల్వే అధికారులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఈ నెల 28  నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ రైళ్లలో రిజర్వేషన్​ ఉండదని అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు సికింద్రాబాద్, మంచిర్యాల మీదుగా 3 సర్వీసులు, మంచిర్యాల–సికింద్రాబాద్​ మధ్య మరో 3, సికింద్రాబాద్​– సిర్పూర్​కాగజ్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2, సిర్పూర్​ కాగజ్‌‌‌‌‌‌‌‌ నగర్​– సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌కు 2, నిజామాబాద్–వరంగల్​మధ్య 4, వరంగల్–నిజామాబాద్​ మధ్య 4, కాజీపేట–ఖమ్మం మధ్య 4, ఖమ్మం – కాజీపేట మధ్య 4, ఆదిలాబాద్​–కాజీపేట మధ్య 1, కాజీపేట – ఆదిలాబాద్​మధ్య ఒక సర్వీసు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. 

ఈ రైళ్లన్నీ మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘనాపూర్, పిండ్యాల్, కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, రామగుండం తదితర స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.