ఈ -సిగరెట్ల  ముఠా గుట్టురట్టు 

ఈ -సిగరెట్ల  ముఠా గుట్టురట్టు 
  • నిందితుడు అరెస్ట్ 282 ఈ-సిగరెట్లు  స్వాధీనం

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ ఫోర్స్, ఖైరతాబాద్ జోన్ మంగళ్ హాట్ పోలీసులు కలిసి నిషేధిత ఎలక్ట్రానిక్ ఈ –సిగరెట్లను విక్రయిస్తున్న ఒకరిని అరెస్ట్​చేశారు. అతడి నుంచి రూ. 8.72 లక్షల విలువ చేసే ఈ  సిగరెట్లను పట్టుకున్నారు.  మంగళ్ హాట్ పీఎస్​పరిధిలోని లోయర్ ధూల్​పేటలో ఓ ఇంట్లో ఈ సిగరెట్లు అమ్ముతున్నారనే సమాచారం మేరకు దాడి చేయగా తికలే రోహన్ (23) దగ్గర 282  ఈ–సిగరెట్​స్టాక్​దొరికింది.

తికలే రోహన్, అతడి స్నేహితుడు శివాని ప్రథమ్ తో కలిసి ఈ దందా చేస్తున్నట్టు గుర్తించారు. ముంబైలోని పర్వీన్​సల్మాన్ జుబేర్ అనే ఏజెంట్ ద్వారా తక్కువ ధరకు నిషేధిత ఈ– -సిగరెట్లను ప్రగతి పార్శిల్ సర్వీస్ ద్వారా నగరానికి తీసుకువస్తున్నారు.  శివాని ప్రథమ్, పర్వీన్​సల్మాన్, జుబేర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.