29 మంది ఐపీఎస్​ల బదిలీ

29 మంది ఐపీఎస్​ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్ మెంట్ లో 29 మంది ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. కీలక విభాగాల్లోని అడిషనల్ డీజీ స్థాయి అధికారులకు ట్రాన్స్ ఫర్స్, పోస్టింగ్ ఇస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కొటిక్ బ్యూరో చీఫ్ గా సిటీ సీపీ సీవీ ఆనంద్ ను నియమించారు. ఇందుకోసం అడిషనల్ డీజీ ర్యాంక్ ను క్రియేట్ చేసారు. సందీప్ శాండిల్యను పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా నియమించారు. తెలంగాణ పోలీసు రిక్రూట్​మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్న వీవీ శ్రీనివాస్ రావును కంప్యూటర్ సర్వీసెస్ కు బదిలీ చేశారు. ఏసీబీ డైరెక్టర్ గా ఉన్న శిఖాగోయల్ ను విమెన్ సేఫ్టీ వింగ్ డీజీగా,  స్వాతి లక్రాను కొండాపూర్ బెటాలియన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సైబర్ సెక్యూరిటీ వింగ్ ఐజీగా ఆదనపు బాధ్యతలు అప్పగించారు. అడిషనల్ డీజీ రాజీవ్ రతన్ ను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని ఏడీజీ పోలీస్ ఆర్గనైజేషన్ లీగల్ కు, ఏడీజీ శివధర్ రెడ్డిని రైల్వేస్ రోడ్ సేఫ్టీ, అభిలాష అడిషనల్ డీజీ టీఎస్ ఎస్ పీ బెటాలియన్స్ కు ఉండగా ఆమెను వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కు బదిలీ చేసారు. విజయ్ కుమార్ ను గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోపస్ అడిషనల్ డీజీ గా, నార్త్ జోన్ ఏడీజీ నాగిరెడ్డిని డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డీజీగా, విక్రమ్ సింగ్ మాన్ ను సిటీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీగా, రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు ను హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ గా, షానవాజ్ కాసీం ను మైనార్టీ వెల్ఫేర్ డైరెక్టర్ నుంచి మల్టీ జోన్–2 ఐజీ గా నియమించారు. తరుణ్ జోషి ని పోలీస్ ట్రైనింగ్ ఐజీగా, కమలాసన్ రెడ్డి ని ఐజీ పర్సనల్ గా , రామగుండం సీపీని మల్టీజోన్–1 కు ఐజీగా, హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ రమేశ్ ను ప్రోవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ ఐజీగా నియమించారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ కార్తికేయను ఇంటిలిజెన్స్ డీఐజీ గా, పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ రమేశ్ నాయుడును రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీగా నియమించారు. సీఐడీ డీజీ ఎం.శ్రీనివాసులు సీఎఆర్ హైదరాబాద్ సిటీగా బదిలీ చేశారు. రామగుండం సీపీగా ఎవరిని నియమించలేదు.