వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీస్

వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీస్

బిగ్ సినిమాలు బిగ్ బడ్జెట్ లో రూపొందుతాయి. హిట్ కొడితే అందుకు తగ్గట్టే వసూళ్లు చేస్తాయి. అయితే ఓ భారీ బడ్జెట్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే.. దాదాపుగా తొమ్మిది పది రోజుల్లో సాధ్యం అయితుంది. అది కూడా విజయవంతమైన టాక్ తెచ్చుకుంటేనే ఇది వీలవుతుంది. అయితే మీడియం రేంజ్ మూవీస్ కి మాత్రం బిగ్ టాక్ వచ్చింది అంటే, తొందర్లోనే బ్రేక్ ఈవెన్ లోకి అడుగుపెడుతుంటాయి. అయితే కొన్ని మూవీస్ మాత్రం మూడు రోజుల్లోనే ఈ ఫీట్ కు చేరుకొని వావ్ అనిపిస్తున్నాయి.

అప్పట్లో 'ఇస్మార్ట్ శంకర్' ఈ ఘనత సాధించి.. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్ ను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ మూవీ. అలాగే చిన్న చిత్రంగా వచ్చిన 'డిజే టిల్లు' కూడా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన బింబిసార మరోసారి థియేటర్లకు కళ తీసుకొచ్చింది. ఈ మూవీ 15.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. త్రీ డేస్ లోనే దాదాపుగా 18 కోట్ల కలెక్షన్లు రాబట్టి..బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది.

ఇక నిఖిల్ 'కార్తికేయ 2' మూవీకి విడుదలైన మొదటి ఆట నుండే హిట్ టాక్ వచ్చింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా మంచి రన్ చూపిస్తుంది. అక్కడ రోజు రోజుకు కలెక్షన్లతో పాటు థియేటర్ల సంఖ్య కూడా పెంచుకుంటు పోతుంది. చందూ మోండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ కృష్ణతత్వం చుట్టు స్టోరీ నడుస్తుంది. ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మూవీని కొన్న బయ్యర్లకు లాభాలు తీసుకొచ్చేల పయనం సాగిస్తుంది. రీసెంట్ గా 'బింబిసార', 'కార్తికేయ 2' సాధించిన భారీ హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఫుల్ ఖుషీ అయితుంది.