20 నిమిషాల్లో 20 లక్షల కోట్లు సంపద సృష్టి : మన స్టాక్ మార్కెట్ లో బీభత్సమైన ర్యాలీ

20 నిమిషాల్లో 20 లక్షల కోట్లు సంపద సృష్టి : మన స్టాక్ మార్కెట్ లో బీభత్సమైన ర్యాలీ

మన స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతుంది.. ఎలా అంటే.. జస్ట్ 20 నిమిషాల్లో 20 లక్షల కోట్ల సంపద సృష్టించింది. అవును.. వెరీ వెరీ షాకింగ్.. జస్ట్ 20 అంటే 20 నిమిషాల్లోనే.. మన స్టాక్ మార్కెట్ సంపద 20 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 2 వేల పాయింట్లు.. నిఫ్టీ 700 పాయింట్లు.. బ్యాంక్ నిఫ్టీ 15 వందల పాయింట్లు.. ఇలా ప్రతి షేర్ గ్రీన్ లో ట్రేడ్ అవుతుంది. నిన్నా మొన్నటి వరకు పడుతూ వచ్చిన స్టాక్ మార్కెట్.. 2026, ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రోజు ఎందుకింత బూస్ట్ అయ్యింది.. పాజిటివ్ ర్యాలీ ఎందుకు కొనసాగుతుంది.. దీనికి కారణాలు ఏంటీ అనేది తెలుసుకుందాం...

మార్కెట్ ఇంతలా పెరగడానికి 3 ముఖ్య కారణాలు:
1. పన్నుల తగ్గింపు (టారిఫ్ కట్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుండి వచ్చే వస్తువులపై పన్నును (Import Duty) 50% నుండి 18%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మన దేశ వస్తువులు అమెరికాలో తక్కువ ధరకు దొరుకుతాయి, తద్వారా మన ఎగుమతులు భారీగా పెరుగుతాయి. ఇతర ఆసియా దేశాల కంటే (పాకిస్థాన్, వియత్నాం వంటివి) భారత్‌కే ఇప్పుడు ఎక్కువ ప్రయోజనం కలిగింది.

ALSO READ : భారత్-యుఎస్ ట్రేడ్ డీల్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. టాప్ లో రిలయన్స్, అదానీ షేర్లు..

2. రూపాయి విలువ : ఈ ఒప్పందం ప్రభావంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1% బలపడి 90.40కి చేరింది. అలాగే ప్రభుత్వ బాండ్ల రేట్లు తగ్గడం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. రూపాయి బలంగా ఉంటే విదేశీ పెట్టుబడులు మన దేశానికి ఎక్కువగా వస్తాయి.

3. వస్త్ర రంగం (Textiles) : ఈ డీల్ వల్ల వస్త్ర పరిశ్రమకు భారీ లాభం చేకూరనుంది. అందుకే ఈ రంగానికి చెందిన షేర్లన్నీ 20% అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. దుస్తులతో పాటు ఆటోమొబైల్, రొయ్యల ఎగుమతుల కంపెనీల షేర్లను కూడా కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.

రికార్డు సృష్టించిన నిఫ్టీ:
నేడు నిఫ్టీ-50 ఏకంగా 1,200 పాయింట్ల భారీ లాభంతో మొదలైంది. నిఫ్టీ చరిత్రలో ఒకే రోజు ఇంత పెద్ద స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. మిడ్‌క్యాప్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా  ఆల్-టైమ్ రికార్డులను తిరగరాశాయి.  మిడ్‌క్యాప్ ఇండెక్స్ 60,000 మార్కును దాటగా, నిఫ్టీ బ్యాంక్ 61,400 పాయింట్ల పైన ప్రారంభమైంది.