భారత్-యుఎస్ ట్రేడ్ డీల్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. టాప్ లో రిలయన్స్, అదానీ షేర్లు..

 భారత్-యుఎస్ ట్రేడ్ డీల్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. టాప్ లో రిలయన్స్, అదానీ షేర్లు..

సోమవారం భారత్ - అమెరికా మధ్య ప్రకటించిన వాణిజ్య ఒప్పందం ప్రభావం మంగళవారం (ఫిబ్రవరి 2)న  ఉదయం స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. బడ్జెట్ రోజు (ఫిబ్రవరి 1) భారీ క్షీణత తర్వాత, స్టాక్ మార్కెట్ మంగళవారం బలమైన పునరాగమనం చేసింది. ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 3,200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 1,200 పాయింట్లు పెరిగింది.

అమెరికాతో ఒప్పందం తర్వాత:
ఉదయం ట్రేడింగ్‌  ప్రభంభంలో సెన్సెక్స్ 3,656.74 పాయింట్లు పెరిగి 85,323.20కి చేరుకోగా, నిఫ్టీ 1,219.65 పాయింట్లు పెరిగి 26,308.05కి చేరుకుంది. ట్రేడింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఉదయం 11 గంటలకు కూడా మార్కెట్ బుల్లిష్‌గా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో లిస్టయిన చాలా కంపెనీల షేర్లు బుల్లిష్‌గా ఉన్నాయి.

ALSO READ : దిగొస్తున్న బంగారం ధర.. 20 వేలు తగ్గినా వెండి..

రిలయన్స్-అదానీతో సహా పెరిగిన షేర్లు 
18 శాతం సుంకాల తగ్గింపు, వాణిజ్య ఒప్పందం ప్రభావం ఈ రోజు స్టాక్ మార్కెట్లో కనిపించింది. రిలయన్స్-అదానీతో సహా చాల  పెద్ద కంపెనీల షేర్లలో భారీ పెరుగుదల కనిపించింది. సమాచారం ప్రకారం, అదానీ పోర్ట్ షేర్స్  6.91 శాతం పెరిగింది. దిగ్గజ కంపెనీ రిలయన్స్ షేర్స్ కూడా 4 శాతం పెరిగింది.  అలాగే ఎటర్నల్, ఇన్ఫి, ఇండిగో, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, హెచ్డీఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్,  హెచ్సియల్ టెక్, టిసిఎస్, టైటాన్, ఆక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.