అవినీతి కేసులో తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలుశిక్ష

అవినీతి కేసులో తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలుశిక్ష

తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి ఎదురు దెబ్బ తగిలింది. అవినీతి కేసులో అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది మద్రాసు హైకోర్టు. అతడితో పాటు ఆయన భార్య  పీ. విశాలాక్షికి రూ. 50లక్షల జరిమానా వేసింది. ఆయనపై ప్రస్తుతం మంత్రి బాధ్యతలు ఉండటంతో 30 రోజులు జైలు శిక్షను సస్పెండ్ చేసింది.  తన వయసు(73) ను పరిగణలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని పొన్ముడి కోర్టును కోరారు. పొన్ముడి దంపతులను నిర్దోషులుగా విడుదల చేసిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు పక్కన పెట్టింది. 

పొన్ముడి (73) డీఎంకే నేతృత్వంలోని హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు 2006 నుంచి 2011 వరకు రూ.1.75 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు కేసు నమోదయ్యింది. 

అయితే వారిని 2016లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. డిసెంబర్ 19న  ఆ తీర్పును పక్కన పెట్టిన హైకోర్టు..ఇవాళ తీర్పును వెల్లడించింది.  అవినీతి నిరోధక చట్టం, 1988 ప్రకారం శిక్షార్హమైన నేరం ప్రకారం వాళ్లిద్దరిని దోషులుగా ప్రకటించింది.