ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు

ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన మూడేళ్ల బాలుడు

బీహార్‌లో దారుణం జరిగింది. నలందాలోని కుల్ గ్రామంలో 2023 జూలై 23 ఆదివారం  మూడేళ్ల బాలుడు పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు  బోరుబావిలో పడిపోయాడు.  దీంతో సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించేందుకు చర్యలు ప్రారంభించాయి.  బోరుబావిలోకి ఆక్సిజన్ పంపి సమాంతరంగా జేసీబీతో తవ్వుతున్నారు.  బాలుడు 40- నుంచి 50 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. 

"చిన్నారి బోరుబావిలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. అతన్ని రక్షించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఎన్‌డిఆర్‌ఎఫ్ , రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పిల్లవాడు ఇంకా బతికే ఉన్నాడు, అతని గొంతు మాకు వినిపిస్తుంది" అని సిల్వా సర్కిల్ ఆఫీసర్ శంభు మండల్ తెలిపారు.  చిన్నారిని శివం కుమార్‌గా గుర్తించారు.   

ఓ రైతు బోరుబావి వేసి.. పూడ్చకపోవడంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. శివమ్‌తో ఆడుకుంటున్న పిల్లలు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శివమ్‌ తమతో ఆడుకుంటూ అకస్మాత్తుగా కాలు జారి బోరుబావిలో పడిపోయాడు.