హైదరాబాద్ సిటీ, వెలుగు: జనవరి 16, 17 తేదీల్లో సిటీ ట్రాఫిక్పోలీసులు నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్తనిఖీల్లో 305 పట్టుబడ్డారు. ఇందులో 242 మంది టూవీలర్లు నడిపిన వారు ఉండగా, ఆటో- డ్రైవర్లు 26 మంది, ఫోర్‌వీలర్ డ్రైవర్లు 35 మంది ఉన్నారు. 30-–50 పాయింట్లు వచ్చిన వారు 65, 51– -100 వచ్చిన వారు 134, 101–-150 వచ్చిన వారు 39 , 151– -200 వచ్చిన వారు 35, 201– -250 వచ్చిన వారు 11 , 251–-300 వచ్చిన వారు 8 మంది ఉన్నారు.
300 రీడింగ్కంటే ఎక్కువ వచ్చిన వారు 13 మంది ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్పరిధిలో 231 మందిపై డ్రంక్ అండ్డ్రైవ్కేసులు నమోదు చేశారు. వీరిలో 187 మంది బైకర్లు, 15 మంది ఆటో డ్రైవర్లు, 29 మంది కార్డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. వీరిలో 40 మందికి 50 రీడింగ్రాగా, 96 మందికి 51–100, 41 మందికి 101–150, 26 మందికి 151–200, 16 మందికి 201–300 వచ్చింది. మరో 12 మందికి 300కు పైగా రరీడింగ్వచ్చింది.
