ఐబీ రికార్డుల ప్రకారం ఇండియాకు
వలస వచ్చిన మైనార్టీలు వీరే
న్యూఢిల్లీ: సిటిజన్షిప్చట్టం కింద వెంటనే లబ్ధి పొందే మైనార్టీలు 31,313 మంది అని ఇంటెలిజెన్స్బ్యూరో (ఐబీ) చెప్పింది. వీరిలో 25,447 మంది హిందువులు, 5,807 మంది సిక్కులు, 55 మంది క్రిస్టియన్లు, ఇద్దరు బుద్ధిస్టులు, ఇద్దరు పార్శీలు ఉన్నారని పేర్కొంది. 2016లో పార్లమెంటరీ కమిటీకి అందజేసిన రిపోర్టులో ఈ మేరకు వెల్లడించింది. మోదీ ప్రభుత్వం 2016లో సిటిజన్షిప్అమెండమెంట్బిల్లు తీసుకొచ్చినప్పుడు పార్లమెంటరీ కమిటీ పలు ప్రశ్నలు అడగ్గా ఐబీ సమాధానాలిచ్చింది. ఈ చట్టం కింద ఎంత మందికి లబ్ధి చేకూరుతుందని కమిటీ ప్రశ్నించగా ‘‘మా రికార్డుల ప్రకారం 31,313 మంది మైనారిటీలు మతపరమైన హింసకు గురై భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. వారందరూ ఇండియన్ సిటిజన్షిప్కోరుకుంటున్నారు. ఈ చట్టం కింద వీరందరికీ వెంటనే ప్రయోజనం చేకూరుతుంది” అని ఐబీ బదులిచ్చింది.
‘‘ఇండియాకు వచ్చిన సమయంలోనే వలసదారులు ఎవరైతే తాము మతపరమైన హింసకు గురై ఇక్కడికి వచ్చామని చెప్పారో వారే ఈ చట్టం కింద సిటిజన్షిప్ పొందేందుకు అర్హులు. ఈ కారణాలను చూపకుండా వలసదారులు సిటిజన్షిప్కోసం అప్లై చేసుకుంటే… తాము మతపరమైన హింస కారణంగానే భారత్కు వచ్చామని నిరూపించాల్సి ఉంటుంది. దీనిపై రీసెర్చ్అండ్ అనాలిసిస్వింగ్(రా) ఎంక్వైరీ చేస్తుంది” అని చెప్పింది. ‘‘మేం రిపోర్టులో పేర్కొన్న 31,313 మంది తాము మతపరమైన హింస కారణంగానే వచ్చామని ముందే చెప్పారు. వీరిలో కొంతమంది ఇప్పటికే వివిధ రూపాల్లో సిటిజన్షిప్తీసుకున్నారు ” అని ఐబీ వివరించింది.

