
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. 83,885 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయంది. ఒక రోజులో కొవిడ్-19తో 21 మంది చనిపోయారని.. 4,019 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. కొత్త కేసులతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 19,08,336కు చేరిందని తెలిపింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,356గా ఉందంది. చిత్తూరు, తూర్పు గోదావరిలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, కర్నూల్, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరు మరణించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.