330 కిలోల మహిళ.. విమాన ప్రయాణంలో ఎన్ని కష్టాలో..

330 కిలోల మహిళ.. విమాన ప్రయాణంలో ఎన్ని కష్టాలో..

నేటి కాలంలో ఊబకాయం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ఈ స్థూలకాయం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అదే తరహాలో ఒలివియా అలియాస్ చిబి అనే అమ్మాయి బరువు మూడు వందల ముప్పై కిలోలు. ఇటీవలే ఒలీవియా విమానం ఎక్కింది. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాన్ని ఓ వీడియో ద్వారా పంచుకుంది.

విమానయాన సంస్థ వివక్ష చూపుతోందని ఒలివియా ఆరోపించింది. విమానంలోని వ్యక్తులు లావుగా ఉండే ప్రయాణికుల పట్ల చాలా వివక్ష చూపుతున్నారని ఆమె అన్నారు. లావుగా ఉండడంతో ఆమె విమానంలో నడవడానికి, సీటులో కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ను చిబి షేర్ చేసింది. మామూలుగా అయితే ఈ తరహా విషయాలు చెప్పినపుడు ఎవరైనా.. విమానంలో లావుగా ఉన్న వారి కోసం సౌకర్యాలు కల్పించాలని అడగాలి. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి విరుద్ధంగా మారింది. చిబిని లక్ష్యంగా చేసుకుని, నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. తన బరువును తగ్గించుకునే ప్రయత్నించాలని ఆమెకే సూచించారు.

విమానంలో సమస్య
ఒలివియా ఇటీవల విమానంలో ప్రయాణించింది. ఈ సమయంలో ఆమె తన సీటుకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 330 కిలోల బరువున్న ఒలివియా.. విమానంలో దారి ఇరుకుగా ఉండడంతో ఆమె అందులో నడుచుకుంటూ వెళ్లే సమయంలో సీట్లలో కూర్చునే వారిని తాకుతూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒలివియా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మిశ్రమ స్పందన వచ్చింది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. విమానయాన సంస్థలు నిజంగా కొంచెం ఎక్కువ స్థలాన్ని ఏర్పాటు చేయాలని కొందరు అడిగితే.. ఒలివియా తన బరువును తగ్గించుకోవాలని మరికొందరు సూచించారు. ఇక్కడ సమస్య విమానయాన సంస్థలది కాదని పలువురు అన్నారు. ఆమె తన బరువును తగ్గించుకోవాలి. అయితే ఒలివియాకు అలాంటి ఉద్దేశం లేదు. తన శరీరంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఇకపై బరువు తగ్గే ప్రయత్నం చేయనని చెప్పింది.