ఇండియాలో 34 కోట్ల వాహనాలు.. 0.8 శాతమే ఎలక్ట్రిక్ వాహనాలు

ఇండియాలో  34 కోట్ల వాహనాలు.. 0.8  శాతమే ఎలక్ట్రిక్ వాహనాలు

భారత దేశంలో 34 కోట్ల వాహనాల్లో   ఎలక్ట్రానిక్ వాహనాలు కేవలం 0.8 శాతమే ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం  రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇ-వాహన్ పోర్టల్‌లో నమోదైన మొత్తం 34 కోట్ల వాహనాల్లో జూలై 2 నాటికి 27 లక్షల  ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉన్నాయి.

జూలై 14 వరకు 34 కోట్ల 524 వాహనాలు నమోదు కాగా.. వీటిలో 27లక్షల 44 వేల 19 మాత్రమే ఎలక్ట్రికల్ వాహనాలుగా ఉన్నాయి. అంటే దేశంలో ఉన్న మొత్తం వాహనాల్లో  ఎలక్ట్రిక్ వాహనాలు 0.8 శాతమే ఉన్నాయి. 27 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలకు 8738 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. 

అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఢిల్లీలో ఉన్నాయి. ఢిల్లీలో  మొత్తం 84 లక్షల57వేల200 వాహనాలు ఉంటే ఇందులో 2లక్షల29వేల 305 ఎలక్ట్రిక్ వాహనాలు అంటే 2.71 శాతం ఉన్నాయి. 
 అస్సాంలో 2.16 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా.. త్రిపురలో 2.02 శాతం  ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. 

 దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 2015లో పాన్ ఇండియాప్రాతిపదికన భారతదేశంలో (హైబ్రిడ్ &) ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్ ఇండియా) స్కీమ్‌ను ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌ని ప్రవేశపెట్టింది.