V6 News

బెంగళూరులో దారుణం : రక్తపు మడుగులో నగ్నంగా మహిళ.. ఆమె చుట్టూ చిందర వందరగా పేపర్లు

బెంగళూరులో దారుణం : రక్తపు మడుగులో నగ్నంగా మహిళ.. ఆమె చుట్టూ చిందర వందరగా పేపర్లు

బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఇంట్లో రక్తపు మడుగులో నగ్నంగా మహిళ మృతదేహం లభించడం కలకలం రేపింది.బెంగళూరులోని అడగుడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాకు చెందిన పూజా దత్తా బోష్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ...అడగుడిలోని ఓ అపార్ట్మెంట్ లో మూడేళ్ళుగా ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో పూజా తన ఫ్లాట్ లో నగ్నంగా.. రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం...ఆమె చుట్టూ చిందరవందరగా పేపర్లు పడి ఉండటం మిస్టరీగా మారింది.

పూజా ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో పక్కన ఫ్లాట్ లో ఉండే బ్యాచిలర్స్ తనకు కంప్లైంట్ చేశారని చెబుతోంది ఇంటి ఓనర్ జానకమ్మ. పూజ ఫ్లాట్ కి వెళ్లి చూడగా... ఫ్లాట్ లోపల చేసుకొని... రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉందని తెలిపింది ఓనర్. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని అన్నారు.

ఓనర్ ఫిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమితం ఆసుపత్రికి తరలించారు. పూజ మృతదేహం పాక్షికంగా కుళ్లిపోయి ఉందని... మూడు రోజుల క్రితమే పూజ మరణించి ఉండచ్చని అంటున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. అయితే ఇంట్లో చెల్లాచెదురుగా పడి ఉన్న చిరిగిన పేపర్స్, బాడీ పక్కన టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి ఉండటం చూస్తుంటే.. ఆమె లోపలి నుండి తలుపుకు తాళం వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానిస్తున్నారు పోలీసులు.

పూజ గత మూడేళ్ళుగా తన ఇంట్లో అద్దెకు ఉంటోందని... ఆమె చివరిసారిగా ఏప్రిల్ 23న సరుకులు కొనడానికి బయటికి వెళ్తూ కనిపించిందని తెలిపింది. పూజ ఎక్కువగా హిందీలోనే మాట్లాడేదని... ఓ వ్యక్తి తరచూ పూజ ఫ్లాట్ కి వచ్చేవాడని.. అతనితో పూజ తరచూ గొడవపడేదని తెలిపింది ఓనర్. 

పూజ ఇంట్లో పెద్ద స్పీకర్ ఉండేదని.. ఎక్కువ సౌండ్ తో సాంగ్స్ ప్లే చేసేదని తెలిపింది ఓనర్. ఈ విషయంలో ఇరుగుపొరుగు వాళ్ళు తనకు కంప్లైంట్ చేశారని... పూజను ఫ్లాట్ ఖాలీ చేయమని మందలిస్తే తనతో గొడవకు దిగిందని తెలిపింది ఓనర్. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇది హత్యనా, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.