జన్ జీ దెబ్బ.. బీజేపీకి ఎదురు దెబ్బ: మూడింటిలో 2 నియోజకవర్గాల్లో ఓటమి.. బీహార్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు

జన్ జీ దెబ్బ.. బీజేపీకి ఎదురు దెబ్బ: మూడింటిలో 2 నియోజకవర్గాల్లో ఓటమి.. బీహార్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు

నీట్ పేపర్ లీక్ తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ తో సహా దేశ వ్యాప్తంగా జరిగిన జెన్ జీ ఉద్యమం ఎఫెక్ట్.. బీజేపీ పార్టీపై గట్టిగానే పడింది. జెన్ జీ ఉద్యమం తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల్లోని.. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. ఈ మూడు రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉండటం విశేషం. 

బీజేపీ 30 ఏళ్ల కంచుకోటకు బీటలు:

బీహార్ రాష్ట్రం బంకిపూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీ.. తన రాజీనామాతో ఉప ఎన్నిక జరిగింది. 30 ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త పార్టీ ఎగిరింది. జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ రెండో స్థానంలో ఉంది.

మొత్తం 32 రౌండ్ల  లెక్కింపు పూర్తయ్యింది.  ప్రశాంత్ కిషోర్ కు 63 వేల 946  ఓట్లతో ఘనవిజయం సాధించారు.  బీజేపీ అభ్యర్థి  నీరజ్ కుమార్ పై 19 వేల 246 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక నీరజ్ కుమార్ కు44 వేల  700 ఓట్లు వచ్చాయి.    ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారీ 14 వేల 241 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.  

ALSO READ : సహజీవనంలో ఉన్న మహిళకూ సెక్షన్ 498A వర్తిస్తుంది

మధ్యప్రదేశ్ లో ఎగిరిన కాంగ్రెస్ జెండా:

ఇక మధ్యప్రదేశ్ లోని దాతియా నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యాం సింగ్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6 వేల 16 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 15 రౌండ్ల లెక్కింపులో ఘన శ్యామ్ సింగ్ కు 66 వేల 757 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి తివారీ 60 వేల 741 ఓట్లతో రెండో స్థానానికి పరిమితం అయ్యారు.  

గుజరాత్ లో బీజేపీ గెలుపు:

అటు గుజరాత్ లోని మంజల్ పూర్ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి  అభ్యర్థి సతీష్ పటేల్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బిఖాభాయ్ రబరీపై  30 వేల 630 ఓట్ల తేడాతో  గెలిచారు.  సతీష్ పటేల్ కు మొత్తం 55 వేల 481 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి 24 వేల 851 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.