
జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనూ ఉండొచ్చంటున్న డాక్టర్లు
అనుమానితులకు ప్రత్యే క గది, బాత్ రూమ్ ఉంటే చాలు
హైదరాబాద్, వెలుగు: ఐసోలేషన్ వార్డు, హోమ్ ఐసోలేషన్.. కరోనా వైరస్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. కరోనా పేషెంట్లు, అనుమానితుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులతో ఏర్పాటు చేసేవి ఐసోలేషన్ వార్డులు. ఇంట్లో ఒంటరిగా ఉంచి ట్రీట్ మెంట్ చేస్తే హోమ్ ఐసోలేషన్ అంటారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో 36 మంది ఉండగా.. రాష్ట్రం లో 343 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. వైరస్ సోకిందని అనుమానంతో వచ్చిన వాళ్లకు చెక్ చేశాక కరోనా లేదని తేలితే కొన్ని రోజులు బయటకు వెళ్లొద్దని, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పి పంపిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండే వారు, వాళ్ల కుటుంబీకులు తప్పనిసరి సూచనలు పాటించాలని డాక్టర్లు అంటున్నారు.