- తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదు
కాగజ్‌నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత నదీ తీరం వెంట బుధవారం రాత్రి భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కాగజ్‌నగర్ డివిజన్‌లోని కౌటాల, బెజ్జూర్, పెంచికల్‌పేట్ ప్రాంతాల్లో రాత్రి 11.49, 11.50 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.
ఈ విషయాన్ని గుర్తించిన పలువురు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదు అయినట్లు, రామగుండానికి 57 కిలోమీటర్ల దూరంలో భూకేంద్రం నమోదు అయినట్లు నిర్ధారించారు. భూ కంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగలేదు
