ఢిల్లీలో థర్డ్ వేవ్ వచ్చేసింది

ఢిల్లీలో థర్డ్ వేవ్ వచ్చేసింది

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా థర్డ్ వేవ్ తీవ్రంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి  సత్యేంద్ర జైన్ అన్నారు. నిన్న ఒక్కరోజే నగరంలో 10 వేలకుపైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయన్నారు. పాజిటివిటీ రేటు 10 శాతం ఉందన్నారు. 300 నుంచి 400 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామన్నారు. అన్ని శాంపిళ్లకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం సాధ్యం కాదన్నారు. 

కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం, ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో కొవిడ్ వార్ రూమ్ యాక్టివేట్ చేశామని సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు. వార్ రూమ్ నుంచి జిల్లాలతోపాటు ఆస్పత్రుల వారీగా డేటా, బెడ్ ఆక్యుపెన్సీ, పేషెంట్లు, ఆక్సిజన్ తదితర సమాచారాన్ని నిరంతరం పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ బెడ్స్ కొవిడ్ పేషెంట్స్ కోసం కేటాయించాలని ఆదేశించారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో వారాంతంలో కర్ఫ్యూ విధించారు. శుక్రవారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ రూల్స్ అమల్లోకి రానున్నాయి. అయితే ఈ సమయంలో అత్యవసర సేవలకు అనుమతి ఉంటుంది. 

మరిన్ని వార్తల కోసం: 

స్త్రీల హక్కులను పురుషులే నిర్ణయిస్తారా?

అనాథల అమ్మ సింధుతాయ్ ఇకలేరు

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక