సైఫాబాద్, వెలుగు: పరిశ్రమలు, ఆవిష్కరణలు, సాంకేతికతకు వేదికగా నిలిచే ఐఐటెక్స్(ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో)-–2026 మూడో ఎడిషన్‌ను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ప్రకటించింది.
ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ప్రదర్శన నిర్వహించనున్నారు. శుక్రవారం రెడ్ హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్.రవికుమార్ మాట్లాడుతూ.. తయారీదారులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చే పారిశ్రామిక ప్రదర్శనగా ఐఐటెక్స్ ఎదిగిందని తెలిపారు. ఈసారి 100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారని, తయారీ, ఇంజినీరింగ్, ఆటోమేషన్, పునరుత్పాదక ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, లాజిస్టిక్స్ తదితర రంగాలకు చెందిన 10 వేల మందికి పైగా వ్యాపార ప్రతినిధులు, సందర్శకులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
