జగిత్యాల: మున్సిపల్ అధికారులకు మళ్లీ విజిలెన్స్ నోటీసులు

జగిత్యాల: మున్సిపల్ అధికారులకు మళ్లీ విజిలెన్స్ నోటీసులు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో ట్యాక్స్ అంచనాలు, హెచ్చు-తగ్గులు, కమర్షియల్ భవనాల పన్నుల నిర్ధారణలో జరిగిన అవకతవకాలపై విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విజిలెన్స్ అధికారులు కమర్షియల్ భవనాలను పరిశీలించి విచారణ చేశారు.ఈ విచారణలో కొన్ని లోపాలు, ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం. 

కాగా తాజాగా మరోసారి విజిలెన్స్ అధికారులు.. మున్సిపాలిటీలో రెవెన్యూ విధులు నిర్వహిస్తున్న సుమారు 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, గతంలో సస్పెండ్ అయిన ఒక జూనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌కు కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని విజిలెన్స్ కార్యాలయంలో శనివారం హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.