పద్మారావునగర్, వెలుగు: క్యాన్సర్ కణాలు, కారకాల గుర్తింపులో ఆంకో పాథాలజీ కీలకమని టాటా మెమోరియల్ హాస్పిటల్డాక్టర్ సుమిత్ అగర్వాల్ అన్నారు. శుక్రవారం గాంధీ మెడికల్ కాలేజీలో వైద్యులకు, విద్యార్థులకు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్యాన్సర్ నిర్ధారణపై అవగాహన కల్పించారు. మానవ శరీరంలోని వివిధ అవయవాలు, కణజాలాలలో వచ్చే మార్పులను మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించి, క్యాన్సర్‌ను ఎలా కచ్చితంగా నిర్ధారించవచ్చో వివరించారు.
అనంతరం వైద్య నిపుణులు 35 రకాల క్యాన్సర్ కేసులను పరిశీలించి, వాటిపై లోతైన అధ్యయనం చేశారు. ఇలాంటి సదస్సులు వైద్యరంగ అభివృద్ధికి, సరికొత్త పరిశోధనలకు తోడ్పడతాయని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర పేర్కొన్నారు. గాంధీ పాథాలజీ హెచ్‌వోడీ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, డాక్టర్లు సునేత్రి, సృజన, ఎంపీహెచ్వో వేణుగోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
