ఎండాకాలం వచ్చిందంటే హిమాలయాల ట్రెక్కింగ్‌లు మొదలవుతాయి. ఇప్పుడు కేదారనాథ్, బద్రీనాథ్ యాత్రలు కూడా మొదలయ్యాయి. వీటికి కూడా చాలామంది నడుస్తూనే వెళ్తుంటారు. అయితే..ఇలాంటి ట్రెక్ యాత్రలకు ఇండివిడ్యువల్‌గా వెళ్లినప్పుడు కొన్ని గాడ్జెట్, యాక్సెసరీస్ తీసుకెళ్లడం బెటర్. వాటిలో కొన్ని..
హెడ్‌ల్యాంప్
చీకటి పడ్డాక ట్రెక్కింగ్ చేసేటప్పుడు హెడ్‌ల్యాంప్ కచ్చితంగా వాడాలి. ఎందుకంటే.. ట్రెక్కింగ్ చేసేటప్పుడు చేతుల్లో స్టిక్స్ ఉంటాయి. లేదంటే.. లగేజీ ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా టార్చ్ లైట్‌ని పట్టుకోవడం కాస్త ఇబ్బందే. అందుకే హెడ్‌ల్యాంప్ తగిలిస్తే సరిపోతుంది. ఎలిఫెంట్ బోట్ కంపెనీ తీసుకొచ్చిన ఈ హెడ్‌ల్యాంప్ స్ట్రిప్‌లో ఆక్సిలరీ లైట్ ఉంటుంది. వైడ్ ఏరియాని కవర్ చేస్తుంది. అంతేకాదు ఇందులో 5 లైట్ మోడ్‌లు ఉంటాయి. వాటితో కావాల్సింత లైట్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇందులో మోషన్ సెన్సర్ కూడా ఉంటుంది. చేతులతో లైట్ కదిలించి ఆన్/ఆఫ్ చేయొచ్చు. ఇందులో 1200mAh బ్యాటరీ ఉంటుంది. పవర్‌బ్యాంక్, అడాప్టర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు దాదాపు 3 గంటలు పడుతుంది.
ధర: 959 రూపాయలు
లైఫ్ స్ట్రా
ట్రెక్కింగ్ లాంటివి చేసినప్పుడు ముఖ్యంగా బాడీ డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. లేదంటే.. లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. కానీ.. కొండప్రాంతాల్లో కొన్నిసార్లు మంచినీళ్లు దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు దొరికిన నీళ్లనే ఫిల్టర్ చేసుకుని తాగాలి. అందుకోసం ఈ లైఫ్ స్ట్రాని వెంట తీసుకెళ్తే సరిపోతుంది. ఇది ఎలాంటి నీటినైనా ఫిల్టర్ చేస్తుంది. దాదాపు 99 శాతం బ్యాక్టీరియా, పరాన్నజీవులను ఇది ఫిల్టర్ చేస్తుంది. నీటిలోని మైక్రోప్లాస్టిక్‌లు, ఇసుక, ధూళిని కూడా 99 శాతం వరకు వడపోస్తుంది. ఫిల్టర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. స్ట్రాని నీళ్లలో పెట్టి తాగేయడమే. లైఫ్‌స్ట్రా బరువు 57 గ్రాముల కంటే తక్కువే ఉంటుంది. ఎలక్ట్రికల్ పవర్, బ్యాటరీలు అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఇందులో ఉండే మెంబ్రిన్ మైక్రోఫిల్టర్ 4,000 లీటర్ల నీటి వరకు ఫిల్టర్ చేస్తుంది.
ధర: 1,340 రూపాయలు
సోలార్ ఛార్జర్
ట్రెక్కింగ్‌లకు వెళ్లినప్పుడు ఎదురయ్యే మొదటి సమస్య గాడ్జెట్స్‌లో ఛార్జింగ్ అయిపోవడం. అందుకే పవర్ బ్యాంక్‌లు వెంట తీసుకెళ్తుంటారు. కానీ.. వాటిలో కూడా ఛార్జింగ్ అయిపోతే.. అందుకే సోలార్ ఛార్జర్‌ని కూడా వెంట తీసుకెళ్తే సరిపోతుంది. రకరకాల సోలార్ ఛార్జర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. హోన్లైఫ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ సోలార్ ఛార్జర్ 5వోల్డ్స్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు, ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు దీంతో పవర్ బ్యాంక్‌లు, గాడ్జెట్స్‌కి ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఉండే మైక్రో యూఎస్బీ పోర్ట్‌కి కేబుల్ కనెక్ట్ చేసుకుని గాడ్జెట్స్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ధర: 1,494 రూపాయలు
లిస్టా
మంచు ప్రదేశాల్లో ట్రెక్కింగ్ చేయాలంటే.. ముఖ్యంగా పోల్స్ ఉండాలి. వీటిసాయంతో ఈజీగా ముందుకు వెళ్లొచ్చు. వీటిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ బరువుండే పోల్స్ అయితే బెటర్. లిస్టా కంపెనీ అలాంటి పోల్స్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది టూల్-ఫ్రీ టెన్షనింగ్ ఇస్తుంది. చాలా తక్కువ బరువు ఉంటుంది. అంతేకాదు.. దీని హ్యాండిల్‌కు ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది. చీకట్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు ఇది బాగా పనికొస్తుంది.
ధర: 579 రూపాయలు
