కరీంనగర్ లో 40 మంది అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్లకు జాబ్స్ : కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి

కరీంనగర్ లో 40 మంది అల్ఫోర్స్  ఉమెన్స్  కాలేజీ స్టూడెంట్లకు జాబ్స్ : కరస్పాండెంట్  రవీందర్ రెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్  ఉమెన్స్  డిగ్రీ అండ్  పీజీ కాలేజీలో గ్రాడ్  గురు ఇన్నోవేషన్స్  కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన  ప్లేస్ మెంట్  డ్రైవ్ లో 40 మంది విద్యార్థులు ఒకేసారి ఉద్యోగాలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్  రవీందర్ రెడ్డి తెలిపారు. ఎంపిక ప్రక్రియలో 150 మంది  పాల్గొనగా, 40 మంది విద్యార్థులు బిజినెస్  డెవలప్​మెంట్  అసోసియేట్  హోదాకు ఎంపికయ్యారని, ఏడాదికి  రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు సాలరీ వస్తుందని చెప్పారు. 

తమ విద్యార్థులు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం కాలేజీలో అందిస్తున్న  విద్యా ప్రమాణాలకు నిదర్శనమని తెలిపారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు  చెప్పారు.  భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఉత్తమ ప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్  అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.