ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి : కలెక్టర్ జితేష్ వి పాటిల్

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి : కలెక్టర్ జితేష్ వి పాటిల్
  • నెలలో 42 రోడ్డు ప్రమాదాలు 17 మంది మృతి 
  • జిల్లా కలెక్టర్ ఆందోళన 

పాల్వంచ,వెలుగు: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో జనవరి ఒక నెలలోనే 49 రోడ్డు ప్రమాదాలు జరిగి 17 మంది మృతి చెందటం బాధాకర మని తక్షణమే ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాం తాల్లో ఒక్క ప్రమాదం కూడా జరగ కుండా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖ ల అధికా రులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాల నడపడం, రహదారి భద్రతను పాటించక పోవడం లాంటి అజాగ్రత్తల వల్లే ప్రమాదాలు జరు గుతున్నట్లు నిర్ధారిం చారు.

తక్షణ మే పాఠశాలల్లో ప్రమాదాలపై వి ద్యార్థులకు అవగాహన కల్పిం చాలని,వీడియోలు,చిత్రాలను ప్రద ర్శించాలని పేర్కొన్నారు. అన్ని బ్లడ్ బ్యాంకులలో రక్త నిర్వహణపై క్ర మం తప్పకుండా నివేదికలు అం దించాలని, రక్తం కొరత ఉన్నట్టయి తే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జిల్లా కలె క్టర్ ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడు తూ నిర్ణీత కాల పరిమితిలో తగిన చర్యలు చేపట్టాలని జిల్లా వ్యాప్తం గా ప్రమాదాలు జరిగే 62 ప్రాంతా ల్లో 38 బ్లాక్ స్పాట్లు గుర్తించామని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియం త్రణ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అందుకోసం ట్రాఫిక్ సిగ్నల్స్ అనుమతులు,ఇతర సాం కేతిక చర్యలు వేగంగా చేపట్టాల న్నారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి డిఈ నాగేశ్వరరావు, సంబంధిత జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నా రు.