కారు 45 లీటర్ల ట్యాంకులో.. 52 లీటర్ల ఫుయెల్ ఎలా నింపారు భయ్యా.. పెట్రోల్ బంక్ స్కాం వైరల్

 కారు 45 లీటర్ల ట్యాంకులో.. 52 లీటర్ల ఫుయెల్ ఎలా నింపారు భయ్యా.. పెట్రోల్ బంక్ స్కాం వైరల్

పెట్రోల్ బంకులపై చాలా మందికి చాలా అనుమానాలుంటాయి. రీడింగ్ చూపి ఫుయెల్ నింపినా ఏదో జిమ్మిక్కులు చేస్తారేమోననే డౌట్ తో చూడటం కామన్. అందుకు తగినట్లుగానే.. రీడిండ్ కరెక్టుగా ఉంటుంది కానీ.. ఫుయెల్ మాత్రం బిల్లుకు తగినట్లుగా ఉండదు. ఇలాంటి ఘటనలు ఎన్నో వైరల్ గా మారాయి. లేటెస్టుగా పెట్రోల్ బంకుల స్కామ్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. 

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో పెట్రోల్ బంకులో జరిగిన మోసం గురించి ఇప్పుడు ఇండియా అంతా మాట్లాడుకుంటోంది. కారు ఫుల్ ట్యాంకు కొట్టిచ్చిన ఒక వ్యక్తి.. బిల్లు చూసి షాకయ్యాడు. కారు ఫుల్ ట్యాంకు కెపాసిటీకి మించి బిల్లు రావడమేంటని ఆశ్చర్యపోయాడు. 

చరణ్ సింగ్ అనే కారు ఓనర్.. తన వోక్స్ వాగన్ కారులో ఫుయెల్ నింపుకునేందుకు వెళ్లాడు. ఎంత కొట్టాలన్నా.. అంటే ఫుల్ ట్యాంక్ చేయమని చెప్పేశాడు. బిల్లు చూసే సరికి దిమ్మతిరిగి ఇదేంటి బ్రో అని ఆశ్చర్యపోయాడు. 

  • 41 లీటర్లు కొట్టి డ్రామా..

తన కారు ఫుల్ ట్యాంక్ 45 లీటర్లు.. అయితే 41 లీటర్ల ఫుయెల్ నింపి ఆపేశారు. ఎందుకు పాస్ చేశారని అడిగితే.. పెద్ద మొత్తంలో ఫుయెల్ నింపేటప్పుడు రెండు దఫాలుగా కొట్టడం పద్ధతి అని చెప్పారు. ఆ తర్వాత ఫుల్ ట్యాంకు నింపారు. 

చరణ్ సింగ్ అనుమానం నిజమైంది. మధ్యలో పాస్ చేసి ఏదో తేడా చేస్తున్నారని అనుకున్నట్లే.. ఫుల్ ట్యాంకు కెపాసిటీకి మించి ఫుయెల్ కొట్టినట్లు బిల్లు రావడం షాకింగ్. తన కారులో అంత కెపాసిటీ లేదు.. బిల్లు అలా ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తే.. లేని బిల్లు ఎలా వస్తుంది సర్..
ఉంది కాబట్టే వచ్చింది అంటూ దబాయించే ప్రయత్నం చేశారు. 

  • బండారం ఎలా బయటపడిందంటే..

పెద్ద స్కాంకు పాల్పడటమే కాకుండా దబాయించడంతో.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనికున్న చరణ్ సింగ్.. కార్ షోరూమ్ ఎంప్లాయ్స్ ని పిలిపించాడు. ఆ కారు ట్యాంకు ఫుల్ కెపాసిటీ 45 లీటర్లేనని వాళ్లు నిర్ధారించారు. దీంతో బంకు మోసం బయటపడింది.

మోసం బయటపడటంతో పెట్రోల్ బంకు యాజమాన్యం చరణ్ సింగ్ కు క్షమాఫ చెప్పారు. అయితే తన లాంటి ఎందరు ఈ మోసానికి గురవుతున్నారో.. మరోసారి ఇలాంటి మోసం జరగకూడదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.