రెండో విడతలో యాదాద్రికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు

రెండో విడతలో యాదాద్రికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు

యాదాద్రి, వెలుగు: జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎల్-1 జాబితాలోని అర్హులను గుర్తించి జూన్ 2న ప్రొసీడింగ్స్ అందించనున్నారు. జిల్లాకు ఈ విడతలో 5 వేల ఇండ్లు మంజూరు కానుండగా, ఆలేరు, భువనగిరికి చెరో 2 వేల, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ పరిధిలోని మండలాలకు కలిపి మరో వెయ్యి ఇండ్లు కేటాయించనున్నారు. 

గుడిసెల్లో నివసిస్తున్న 417 కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనుండగా, ఒంటరి మహిళలు, వితంతువులకు తదుపరి ప్రాధాన్యం కల్పించనున్నారు. అనంతరం అత్యంత పేద కుటుంబాలను ఎంపిక చేస్తారు. మొదటి విడతలో జిల్లాకు 9,618 ఇండ్లు మంజూరు కాగా, 4,596 ఇండ్లు పూర్తయ్యాయి. 1,120 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాన్ని విరమించుకోగా, 3,902 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే రూ.236 కోట్లు విడుదలయ్యాయి. ఎంపిక ప్రక్రియను జూన్ 1లోపు పూర్తి చేయనున్నారు.