యూఎస్ నుంచి 50 మంది ఇండియన్ల బహిష్కరణ

యూఎస్ నుంచి 50 మంది ఇండియన్ల బహిష్కరణ

వాషింగ్టన్: అక్రమంగా అమెరికాలో ప్రవేశించి నివాసం ఉంటున్న 50 మంది భారతీయులను ట్రంప్ ప్రభుత్వం తిరిగి ఇండియాకు పంపింది. వీరిలో హర్యానా, గోవా, గుజరాత్, హైదరాబాద్‎కు చెందిన వాళ్లు ఉన్నారు. వీరంతా ఏజెంట్లకు లక్షల రూపాయలు ముట్టజెప్పి.. డంకీ రూట్‎లో అక్రమంగా అమెరికాలో ప్రవేశించినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. 

అందరి చేతులను సంకెళ్లతో బంధించి.. కాళ్లకు బేడీలు వేసి విమానంలో ఎక్కించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిలో హర్యానాలోని కర్నాల్, కైతల్, కురుక్షేత్ర జిల్లాలకు చెందిన యువకులే ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికాకు చెందిన ఎయిర్​ఫోర్స్ సీ17 విమానంలో ఢిల్లీ ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు.