5,185 వడ్ల కొనుగోలు సెంటర్లు క్లోజ్‌‌‌‌

5,185 వడ్ల కొనుగోలు సెంటర్లు క్లోజ్‌‌‌‌
  • ఇప్పటివరకు కొన్నది 48 లక్షల టన్నులే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యాసంగి వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,584 సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టిన సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ అధికారులు.. ఇందులో 5,185 సెంటర్లను మూసివేశారు. ఇంకో 1,399 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా కొనుగోళ్లు జరిపిన సర్కారు ఇప్పటివరకు 48.12 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది. రూ.9,421 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేసి రైతులకు రూ.5,433 కోట్లు అందించింది. రైతులకు ఇవ్వాల్సిన మరో రూ.3,988 కోట్లుపెండింగ్​లో ఉన్నాయి. వడ్లు కాంటా పెట్టినవి వెంట వెంటనే ఓపీఎంఎస్​లో నమోదు చేయకుండా మిల్లర్లకు చేరిన తర్వాతే నమోదు చేస్తుండటంతో రైతులకు నగదు బదిలీ కావడం ఆలస్యం అవుతోందని సమాచారం.