హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేద ఎస్సీ విద్యార్థులకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట, రామంతపూర్)లో సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు రెండు బ్రాంచీల నుంచి ఎస్సీ సంక్షేమ శాఖకు అధికారికంగా సమాచారం అందింది. బేగంపేటలోని హైదరాబాద్పబ్లిక్స్కూల్లో34 సీట్లు, రామంతపూర్ బ్రాంచీలో 19 సీట్లు కేటాయించారు. ఈ సీట్ల భర్తీకి సంబంధించి ఎస్సీ సంక్షేమశాఖ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులను జిల్లా కలెక్టర్లు ఎంపిక చేస్తారని ఎస్సీ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఈ స్కూళ్లలో సీటు పొందిన విద్యార్థుల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయనుంది. తరగతిని బట్టి ఒక్కో విద్యార్థికి రూ. 1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఫీజును ప్రభుత్వమే నేరుగా పాఠశాలలకు చెల్లిస్తుందని ఆయన వివరించారు.
