రాజన్న సిరిసిల్ల: ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలి..స్పేస్ ఏజెన్సీలో సేవలందించిన యువకులకు కలెక్టర్ సన్మానం

రాజన్న సిరిసిల్ల: ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలి..స్పేస్ ఏజెన్సీలో సేవలందించిన యువకులకు కలెక్టర్ సన్మానం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: విద్యార్థులు, యువత ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇటీవల ఆర్బిటర్ కక్షలోకి విక్రమ్ ఆగమన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగంలో విశిష్ట సేవలందించిన సిరిసిల్ల యువకులు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్ కుమార్, బొమ్మదేని నాగరాజును కలెక్టరేట్లో కలెక్టర్ మంగళవారం సన్మానించారు. 

జిల్లా యువకులు స్పేస్ ఏజెన్సీలో సేవలందించడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. యువత, విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని, లక్ష్యం నిర్ణయించుకొని ప్రణాళికతో చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, డీఈవో మొండయ్య, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, పలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు.