బీబీనగర్ ఎయిమ్స్లో ప్రత్యేక సౌకర్యాలు.. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సమాధానం 

బీబీనగర్ ఎయిమ్స్లో ప్రత్యేక సౌకర్యాలు.. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సమాధానం 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే బీబీనగర్‌‌‌‌ ఎయిమ్స్‌‌‌‌లో ప్రత్యేక సౌకర్యాలను విస్తరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణతో పాటు ఏపీ, కర్నాటక, తమిళనాడు ప్రజలకు ఈ సేవలు అందుతాయని అభిప్రాయపడింది.

మంగళవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్‌‌‌‌రావ్ జాదవ్ సమాధానమిచ్చారు. ఎయిమ్స్ బీబీనగర్‌‌‌‌లో వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కింద 'వన్ హెల్త్' రీజినల్ కోఆర్డినేటర్ కేంద్రం, యోగా మైండ్ బాడీ ఇంటర్‌‌‌‌ వెన్షన్ పరిశోధనా కేంద్రాలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.