బైక్‌కు 54చలాన్లు పెండింగ్..కట్టి రశీదుచూస్తే..

బైక్‌కు 54చలాన్లు పెండింగ్..కట్టి రశీదుచూస్తే..

కరీంనగర్ నగరానికి చెందిన వ్యక్తి బైక్ కు 54 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా మంగళవారం తనిఖీ చేస్తుండగా బైకు పట్టుపడింది. జరిమానా వేసేందుకు ప్రయత్నిస్తే.. అప్పటికే ఆ బైకుకు 53 సార్లు జరిమానా పడిందని.. ఒక్కటి కూడా కట్టలేదని తేలింది. దీంతో పోలీసులు అన్ని చలాన్లు కట్టే వరకు బండి ఇవ్వమంటూ వాహనదారునికి తేల్చి చెప్పారు. అన్నీ కట్టేసి పోనాయనా.. మేం పనిచేయడం లేదనుకుంటారని ట్రాఫిక్ పోలీసులు బుజ్జగించడంతో వాహన యజమాని మొత్తం 54 సార్లకు 15 వేల 884 రూపాయలు జరిమానా ఒకేసారి చెల్లించాడు. మీ సేవలో ప్రింట్ చేసిన రశీదు చూస్తే చాంతాడంత వచ్చింది. ఒక్కొక్కరు కనీసం మీటరు దూరం నిలబడి పట్టుకోవడానికి 10 మంది అవసరమయ్యారు. ఒకేసారి ఇంత పెద్ద రశీదు.. ఒకే బైకుకు రావడం చూసి స్థానికులు ఫోటో క్లిక్ మనిపించారు. వెంటనే షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే వ్యక్తికి సంబంధించి 54 పెండింగ్ చలానాలను కట్టించిన కరీంనగర్ పోలీసులు మంగళవారం నాడు నెంబర్ ప్లేట్లు లేని మరో 25 వాహనాలకు సంబంధించిన 65 వేల 975 రూపాయల జరిమానాలు వసూలు చేశారు.