లీజుకు తీసుకున్న భూమిలో 60 లక్షల విలువైన డైమండ్​

లీజుకు తీసుకున్న భూమిలో 60 లక్షల విలువైన డైమండ్​

భోపాల్​: లఖన్​ యాదవ్​ లక్కుల వడ్డడు. ఈ పేద రైతన్న రాత్రికి రాత్రే ఒకే రోజులో ధనవంతుడు అయిపోయిండు. మధ్యప్రదేశ్​లోని పన్నాకు చెందిన యాదవ్​ఒక చోటా రైతు. కొంత పొలాన్ని  గత నెలే లీజుకు తీసుకున్నాడు. నెలకు రూ.200 చొప్పున కిరాయి కడుతున్నడు. ఈమధ్య భూమిని దున్నినప్పుడు, గులకరాయి వంటిది ఏదో కనిపించింది. దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే  డైమండ్ అని తేలింది. ఇక మనోడికి సంతోషానికి పగ్గాలే లేవు. వజ్రాన్ని గవర్నమెంట్​కు ఇస్తే దానిని వేలం వేశారు.

ట్యాక్సులు పోనూ మనోడి ఖాతాలో రూ.60 లక్షలు వడ్డయ్ .‘‘దీంతో నా దశ తిరిగింది. మట్టిలో మొదట అది కనిపించినప్పుడు ఏదో రాయి అనుకున్నా. మట్టి మొత్తం తీసి చూస్తే మస్తు మెరిసింది. ఇగ నేను ఫుల్లు ఖుషీ! మొదట అందిన రూ.లక్ష చెక్​తో బైక్​ కొన్న. ఈ డబ్బుతో నా పిల్లలను బాగ సదివిస్త. ఇంకా తవ్వితే మరో డైమండ్​ దొరకొచ్చేమో!”అంటూ నవ్వేశారు యాదవ్​. అన్నట్టు.. పన్నాలో పది రోజుల్లో నలుగురికి రూ.1.5  కోట్ల విలువైన  వజ్రాలు దొరికాయ్.