నేపాల్ను కుదిపేసిన భూకంపం

నేపాల్ను కుదిపేసిన భూకంపం

పొరుగు దేశం నేపాల్‌లో భారీ భూకంపం వచ్చింది. అర్థరాత్రి 2.12గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకపంనలు నమోదుకావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం ధాటికి దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలిపోవడంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన ఆర్మీ సహాయక చర్యలు చేపడుతోంది. నేపాల్ దోతి జిల్లాలో మంగళవారం సైతం 4.5 తీవ్రతతో భూమి కంపించింది. 

భూకంపం కారణంగా ఆరుగురు చనిపోవడంపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు ట్వీట్ చేశారు.