ఫిలిప్పీన్స్ భూకంపం మరువక ముందే ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (2026 జూన్ 16) తెల్లవారుజామున వచ్చిన ఎర్త్ క్వేక్.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు కావడం ఆందోళన కలిగించింది.
ఇండోనేషియాలోని సులవేసీ ఐలండ్ లో వచ్చిన భూకంపంతో భారీగా కుదుపులు ఏర్పడ్డాయి. భారీ ప్రకంపనలతో భూమిలో పగుల్లు ఏర్పడ్డాయి. పలు కు సౌత్ ఈస్ట్ లో 42 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం 10 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపారు స్థానిక అధికారులు. భూకంపానికి సంబంధించి నష్టంపై ఇంకా అంచనా వేయలేదు. ఆస్తినస్టం ఉన్నప్పటికీ ఇప్పటి వరకుఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కన్నారు.
భూకంప తీవ్రతకు సుమిత్రా దీవులలో పెద్దఎత్తున అలలు ఏర్పడ్డాయి. పసిఫిక్ ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ లో ఈ ప్రాంతం ఉడటంతో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఎర్లీ రిపోర్ట్స్ ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదనిన పేర్కొన్నారు.
అంతకుముందు, ఫిలిప్పీన్స్‌లో సౌత్ ఈస్ట్ సిటీ జనరల్ శాంటోస్‌లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కనీసం 32 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ భూకంపం వల్ల భవనాలు కూలిపోవడంతో పాటు, ఆ ప్రాంతమంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
